పాట్నా: బీహార్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వంతు సాయం అంటూ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి కోవిడ్ సెంటర్ గా మార్చేశాడు. ఈ సెంటర్‌లో కరోనా రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు వీలుగా పడకలు, వెంటిలేటర్, ఆక్సిజన్, ఇతర పరికరాలు సిద్ధం చేశారు. అంతేకాదు తన అధికార నివాసానని కరోనా సెంటర్ గా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు లేఖ రాశారు. ప్రస్తుతం బీహార్‌లో కరోనా వల్ల ప్రతి రోజు వందకు పైగా మరణాలు జరుగుతుండడం, కేసులు కూడా భారీగా నమోదు అవుతున్నందున తన వంతు ఆదుకునే చర్యలు చేపడుతున్నానని ప్రకటించారు.
